ఘనంగా ఆర్.కె.ఎస్.సి నాలుగవ వార్షిక జనరల్ బాడీ మీటింగ్
- March 16, 2025
హైదరాబాద్: ఈ రోజు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ *నాలుగవ వార్షిక జనరల్ బాడీ మీటింగ్* నేరేడ్మెట్లోని రాచకొండ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ఆర్.కె.ఎస్.సి సభ్య కంపెనీల ప్రతినిధులు మరియు పలువురు డీసీపీలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్, కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, నేర నియంత్రణ కోసం, మహిళల భద్రత కోసం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యంతో ఎన్నో విభిన్న అంశాల మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సంవత్సరం రోడ్డు భద్రత పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు, పలు కళాశాలల్లో నిర్వహించిన ప్రత్యేక సెషన్లకు విద్యార్థుల నుండి విశేష స్పందన వచ్చినట్లు పేర్కొన్నారు.ఉమెన్ ఫోరమ్, రోడ్ సేఫ్టీ ఫోరమ్, సైబర్ సెక్యూరిటీ ఫోరమ్ వంటి విభిన్న ఫోరమ్ ల ద్వారా రాచకొండ పోలీసులకు పలు విధాలుగా సహాయకారిగా ఉంటూ సమాజంలో నేర నియంత్రణలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నందుకు ఆర్.కె.ఎస్.సి ని కమిషనర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. యువతను మరియు విద్యార్థులను ఆర్.కె.ఎస్.సి లో భాగస్వామ్యం చేయాలని, వారికి క్రీడలు మరియు ప్రతిభ ప్రదర్శన వంటి పోటీల నిర్వహణ ద్వారా వారిలో మరింతగా నూతన ఉత్తేజాన్ని నింపవచ్చని, సమాజం పట్ల వారి బాధ్యతను మరింతగా గుర్తు చేయవచ్చని తెలిపారు.
మహిళా భద్రతతో పాటు వారి సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యమిస్తున్నామని, మహిళల కోసం ఉమెన్ ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక జాబ్ మేళాను రేపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.1500 ఉద్యోగ ఖాళీలకు గాను దాదాపు 1800 మంది ఆశావహులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా, ఉద్యోగమేళాకు విశేష స్పందన వస్తున్నట్లుగా కమిషనర్ గారు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆర్.కె.ఎస్.సి సభ్య కంపెనీలకు సమాజం పట్ల ఫ్యాషన్ ఉండాలని, సంస్థలో మరిన్ని కంపెనీలు భాగస్వామ్యం తీసుకోవాలని, సభ్యులందరూ మరింత ఉత్సాహంగా రాచకొండ కమిషనరేట్ తో కలిసి పని చేయాలని, నేర నియంత్రణకు అవసరమైన తమ వంతు సూచనలను అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆర్.కె.ఎస్.సి జనరల్ సెక్రటరీ రఘువీర్ సంస్థ యొక్క వార్షిక బ్యాలెన్స్ షీట్ సభ్యులకు చదివి వినిపించారు.రాజంబాల్ 20023-24 సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్‌ను చదివి వినిపించారు. జాయింట్ సెక్రటరీలు ఈ సంవత్సరం ఆర్.కె.ఎస్.సి సంస్థ తరఫున చేపట్టవలసిన కార్యక్రమాలను చర్చించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ పివి పద్మజ డీసీపీ యాదాద్రి అక్షాంశ్ యాదవ్ ఐపీఎస్, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి అడ్మిన్ ఇందిర, డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాసులు, డిసిపి ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, అదనపు డీసీపీ అడ్మిన్ శివకుమార్, RKSC Vice Chairman: P Sudhakar Divis Lab, ఫోరమ్ వైజ్ జాయింట్ సెక్రటరీలు: సేఫ్టీ & సెక్యూరిటి ఫోరమ్:, శ్రీ వాసుదేవ్ రావు - గ్రూప్ డైరెక్టర్ CDC SNIST, ఉమెన్స్ ఫోరం: డాక్టర్ రాధికానాథ్, శ్రీ సాయి సెక్యూరిటీ డైరెక్టర్, సైబర్ సెక్యూరిటీ ఫోరమ్: మిస్టర్ శివ కరాడి SAP సీనియర్ కన్సల్టెంట్ ఇన్ఫోసిస్, ట్రాఫిక్ ఫోరమ్: శ్రీనివాస్: శ్రీనివాస టూర్స్ & ట్రావెల్స్ వ్యవస్థాపక డైరెక్టర్, సోషల్ ఔట్రీచ్ ఫోరమ్:మిస్టర్ వంశీ ప్రోగ్రామ్ మేనేజర్ ఇన్ఫోసిస్, ఆర్.కె.ఎస్.సి చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్