అసలు సిసలు కవిత్వం
- April 19, 2017
అసలు సిసలు కవిత్వం:
అసలు సిసలు కవితకెపుడు
స్వానుభవమె పుట్టినిల్లు;
గుండెకొలిమిలోన మరిగి,
కంటికొనలలోన కరిగి,
పంటిబిగువులోన నలిగి,
ఒంటినరములోన ఉరికె-
అసలు సిసలు కవితకెపుడు
స్వానుభవమె పుట్టినిల్లు.
వాల్మీకీ శ్లోకములకు
స్వానుభవమె పుట్టినిల్లు;
జాషువా పద్యగతికి
స్వానుభవమె పుట్టినిల్లు;
శ్రీ శ్రీ కవితాగ్నికి
స్వానుభవమె పుట్టినిల్లు;
అహర్నిశం అణగద్రొక్కి
అనుక్షణం అదిమిపెట్టి
అనుభవాలు చెక్కినట్టి
కవితాక్షర శిల్పం;
ఎర్రగానె మంటపెట్టి
కాల్చికాల్చి కరగగొట్టి
సమ్మెటతో వంచినట్టి
లోహాక్షర ఖడ్గం;
అదే అదే మహత్వం
అదే అదే పటుత్వం
చచ్చినట్టి జడత్వం
అసలు సిసలు కవిత్వం.
-సిరాశ్రీ
(పొద్దున్నే కాసేపు జాషువాగారి పద్యాలు చదివిన స్వానుభవంతో )
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







