కాకర పుట్నాల పొడి
- October 08, 2017కావలసిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు - 1 కప్పు, పుట్నాలు - అరకప్పు, జీలకర్ర ఒకటిన్నర టీ స్పూను, ఎండుకొబ్బరి పొడి - 1 టేబుల్ స్పూను, కారం - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, వెల్లుల్లి రేకలు -4, పసుపు - చిటికెడు, ఆవాలు - పావు టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: ముక్కలకి ఉప్పు, పసుపు పట్టించి 2 గంటలపాటు ఉంచాలి. పుట్నాలు, ఎండుకొబ్బరి, ఒక టీ స్పూను జీలకర్ర, కారం, (కాస్త)ఉప్పు, వెల్లుల్లి కలిపి పొడికొట్టుకోవాలి. కాకరలోంచి నీటిని సాధ్యమైనంత వరకు పిండేసి నూనెలో దోరగా వేగించి తీసేసి పుట్నాల మిశ్రమంలో కలపాలి. కడాయిలో 2 టీ స్పూన్లు నూనె వేసి ఆవాలు, మిగిలిన జీలకర్ర, కరివేపాకుతో తాలింపు వేసి కాకర మిశ్రమాన్ని జతచేయాలి. అన్నంతో కలుపుకున్నా, పక్కన నంజుకున్నా ఎంతో రుచిగా ఉండే వంటకం ఇది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?