వెన్న తింటే కొవ్వు పెరగదు.. గుండెకు మేలే..
- October 09, 2017వెన్న తింటే కొవ్వు పెరగదు.. గుండెకు మేలే.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. వెన్న తింటే కొవ్వు పెరుగుతుందనీ, బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. అయితే ఇందులో నిజం లేదని.. వెన్నలోని ఎ విటమిన్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని వైద్యులు చెప్తున్నారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండెను దృఢంగా ఉంచుతాయి.
అంతేకాకుండా వెన్నను ఆహారం ద్వారా తీసుకోవడం వలన త్వరగా కడుపు నిండినట్లు ఉండడంతో పాటు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీని వలన అధికబరువు సమస్య తలెత్తదు. వెన్నలో మంచి కొలెస్ట్రాల్ వుండటం ద్వారా చిన్నపిల్లలకు ఇవ్వడం ద్వారా మేలే జరుగుతుంది.
చిన్నపిల్లలకు రోజూ రెండు స్పూన్ల వెన్న ఇవ్వడం ద్వారా.. వారి మెదడూ, నాడీ వ్యవస్థ ఎదుగుదల చక్కగా ఉంటుంది చిన్నతనం నుంచి పిల్లలకు తగు మోతాదులో వెన్నను తినడం అలవాటు చేయడం మంచిది. పెద్దలు మాత్రం రోజుకో స్పూన్ వెన్నను ఆహారంలో చేర్చుకుంటే హృద్రోగ వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు