బీట్రూట్ పాయసం
- October 17, 2017కావలసిన పదార్థాలు: బీట్రూట్ తురుము - 1 కప్పు, క్యారెట్ తురుము - అరకప్పు, బాంబినో మాకరోనీలు - ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు, గోరువెచ్చని పాలు - 2 కప్పులు, వెనీలా ఐస్‌క్రీం - 2 కప్పులు, పంచదార - ఒకటిన్నర కప్పు, ఏలకుల పొడి - అర టీ స్పూను, నేతిలో వేగించిన బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష - 10 చొప్పున, తేనె - 4 టీ స్పూన్లు, నెయ్యి - 1 టేబుల్ స్పూను, నీరు - మూడు కప్పులు.
తయారుచేసే విధానం: నెయ్యిలో బీట్రూట్, క్యారెట్ తురుముల్ని పచ్చివాసన పోయేదాక సన్నని మంటపై వేగించుకోవాలి. మరో పాత్రలో 2 కప్పుల నీరుపోసి మాకరోనీలు ఉడికించాలి. ఇవి మెత్తబడ్డాక వేగించిన బీట్రూట్, క్యారెట్ తురుము, పంచదార, కొబ్బరి తురుము, ఏలకుల పొడి, కప్పు నీరు పోసి పది నిమిషాలు ఉడికించి దించేయాలి. చల్లారిన తర్వాత పాలు, తేనె, వెనీలా ఐస్‌క్రీమ్ కలిపి బాదం, జీడిపప్పు, ద్రాక్షలతో అలంకరించుకోవాలి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?