సంఘమిత్ర' టైటిల్ రోల్లో దిశా పటానీ
- October 21, 2017ఎట్టకేలకు 'సంఘమిత్ర' టైటిల్ రోల్లో నటించేందుకు కథానాయిక దొరికింది. 'లోఫర్' ముద్దుగుమ్మ దిశా పటానీ సంఘమిత్ర టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. 'సంఘమిత్ర అందాల యువరాణి దొరికింది. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది' అని తమిళ నటి కుష్బు ట్విటర్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో జయం రవి, ఆర్య తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
శ్రీతేనాండాళ్ ఫిలిమ్స్ నిర్మాణంలో సుందర్.సి దర్శకత్వం వహించనున్న భారీ బడ్జెట్ చిత్రం 'సంఘమిత్ర'. తొలుత ఇందులో టైటిల్ రోల్లో శ్రుతిహాసన్ నటించారు. కానీ కొన్ని కారణాల వల్ల శ్రుతిహాసన్ ఈ చిత్రం నుంచి వైదొలిగింది. దీంతో అప్పటి నుంచి సంఘమిత్ర యువరాణిగా ఎవరు నటిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. హన్సిక, అనుష్క, నయనతార పేర్లు వినిపించినప్పటికీ చివరికి దిశా పటానీకి ఆ అవకాశం దక్కింది. 'లోఫర్' చిత్రంలో మెగా వారసుడు వరుణ్‌తేజ్ సరసన దిశాపటానీ నటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు