బీట్రూట్ మంచూరియా
- October 23, 2017కావలసిన పదార్థాలు: బీట్రూట్ పావు కేజీ, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, ఉప్పు తగినంత, గరంమసాలా 1 టీ స్పూన్ , పచ్చి మిరపకాయలు నాలుగు, ఉల్లిపాయలు అర కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి మిశ్రమం 1 టీ స్పూన్, కొత్తిమీర ఒక కట్ట, సోయాసాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1/2 టేబుల్ స్పూన్, టమోటా సాస్ 1 టేబుల్ స్పూన్, సాజీర 1/2 టీ స్పూన్, నూనె తగినంత.
తయారుచేయు విధానం: ముందుగా బీట్రూట్ను సన్నగా తురుముకోవాలి. పచ్చి మిరపకాయలను శుభ్రంగా కడుక్కుని కట్ చేసుకోవాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్, ఉప్పు, గరంమసాలా, పచ్చి మిర్చి ముక్కలను సన్నగా తురుముకున్న బీట్రూట్కు కలిపి ఉండలుగా చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో నూనె తీసుకుని కాస్త వేడి అయ్యాక సాజీర, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి మిశ్రమం, మిరియాలు, ఉప్పు, సోయాసాస్, చిల్లీ సాస్, టమోటా సాస్ వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీట్రూట్ ఉండలను ఇందులో వేసుకోవాలి. పైన కొంచెం గరం మసాలా చల్లుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే బీట్రూట్ మంచూరియా రెడీ.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్