సుశాంత్ 'ఆటాడుకుందాం..రా'
- November 06, 2015అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ 'ఆటాడుకుందాం..రా' అంటున్నాడు. 'కాళిదాసు'గా తెలుగు తెరకు పరిచయమైన సుశాంత్ 'కరెంట్', 'అడ్డా' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండేళ్ల విరామం తర్వాత తాజాగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'ఆటాడుకుందాం..రా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ని విడుదల చేసారు. ఆ వీడియోని సుశాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫస్ట్‌లుక్ ని అఖిల్ అక్కినేని లాంచ్ చేసారు. అఖిల్ చిన్నప్పుడు నటించిన సిసింద్రి సినిమాలో ఆటాడుకుందాం.రా అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ పాటలోని పల్లవినే ''ఆటాడుకుందాం..రా'' టైటిల్‌గా పెట్టారు. చింతలపూడి శ్రీనివాసరావుతో కలిసి సుశాంత్ తల్లి ఎ.నాగసుశీల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో సుశాంత్ సరసన సోనమ్ కథానాయికగా పరిచయమవుతోంది. అనూప్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..