చేపలు పెరుగు కర్రీ
- February 17, 2018
కావలసిన పదార్థాలు: (చర్మం లేని) కొరమీను చేప - 1 కిలో, నూనె - అరకప్పు, పెరుగు - 1 కప్పు, ఉల్లిపాయలు - 3, టమేటోలు - 3, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను , అల్లం తరుగు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి (నిలువుగా చీరాలి) - 5, కొత్తిమీర - 1 టేబుల్ స్పూను. ఉప్పు - రుచికి తగినంత, కారం - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, ధనియాలపొడి - 1 టీ స్పూను, కస్తూరి మెంతి - 2 టీ స్పూన్లు, గరంమసాల - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : చేపని శుభ్రపరిచి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, దనియాలపొడి, కస్తూరిమెంతి, గరం మసాల, అల్లం, వెల్లుల్లి పెరుగులో వేసి బాగా కలిపి చేపముక్కలకు పట్టించి అరగంట పక్కనుంచాలి. కడాయిలో ఉల్లితరుగు దోరగా వేగాక టమోటా ముక్కలు, చేపముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. చేపముక్కలు ఉడికి, నూనె పైకి తేలినప్పుడు కొత్తిమీర చల్లి దించేయాలి.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!