గిన్నిస్‌బుక్‌లో చోటు గుంటూరు విద్యార్థిని

- February 17, 2018 , by Maagulf
గిన్నిస్‌బుక్‌లో చోటు గుంటూరు విద్యార్థిని

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: సంప్రదాయక నృత్య రీతుల్లో విశేష ప్రతిభ కనబరిచిన లక్ష్మీపురం మాంటిస్సోరి ఇంగ్లీషు మీడియం స్కూల్‌ 9వ తరగతి విద్యార్థిని బి.సాయికీర్తన గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు సాధించినట్లు పాఠశాల అధినేత కె.వి.సెబాస్టియన్‌ పేర్కొన్నారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికీర్తనను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సెబాస్టియన్‌ మాట్లాడుతూ ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో నాగపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి సంప్రదాయక నృత్యపోటీల్లో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయక నృత్యంలో నైపుణ్యం ప్రదర్శస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక బహుమతులు సాధించిన సాయికీర్తనను గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు పరిశీలించి పురస్కారం అందజేశారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులను చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ వారిలో దాగి ఉన్న కళానైపుణ్యాన్ని వెలికి తీసేందుకు మాంటిస్సోరి కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ మంజు సెబాస్టియన్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com