స్టార్ హీరో సుదీప్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం
- February 22, 2018కన్నడ స్టార్ హీరో సుదీప్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 5 గత నెల చివర్లో ముగిసిన తెలిసిందే. ఈ సీజన్ లో చందన్ శెట్టి విజేతగా నిలిచారు. బిదాడికి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీలో బిగ్ బాస్ హౌజ్ సెట్ వేయగా , ఈ తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్ కారణంగా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయిన, ఆస్తినష్టం మాత్రం బాగానే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలని ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలని ఆర్పేందుకు దాదాపు 5 గంటల సమయం పట్టినట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..