జాతీయ అణు విధానంకు సభలో ఆమోదం తెలిపిన సౌదీ ప్రభుత్వం
- March 13, 2018రియాద్ : అణుశక్తి కోసం కాంపాక్ట్ రియాక్టర్లపై సియోల్ పనిచేస్తుంది. సౌదీ ప్రభుత్వం అణు మరియు పునరుత్పాదక శక్తి కోసం కింగ్ అబ్దుల్లా సిటీ యొక్క చైర్మన్ ,ఇంధన వనరుల మంత్రి ఖలీద్ అల్-ఫాలీ ప్రవేశపెట్టిన జాతీయ అణు కార్యక్రమ విధానాన్ని సోమవారం ప్రభుత్వం సంపూర్ణంగా సమీక్షించిన తర్వాత సభ ఆమోదించింది. అనంతరం అణు విధానం అమలు కోసం కొత్త మార్గదర్శకాలను ప్రచురించింది. శాంతియుత ప్రయోజనాల కోసం అణు అభివృద్ధి అన్ని విధాలా చట్టం రూపొందించడమే కాక, కన్వెన్షన్ మరియు అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి. అణు విధానం కార్యాచరణ విషయాల్లో సంస్థ పారదర్శకతని కొనసాగించడానికి ఒక స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా క్రమబద్ధీకరిస్తారు. అణు భద్రత, భద్రతా విధానాలకు అనుగుణంగా వ్యవహరించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం పిలుపునిచ్చింది. తద్వారా అణు వ్యర్ధ నిర్మూలన కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మసులుకోనున్నట్లు వివరించింది. నిబద్దతతో అణు విధానంను కొనసాగింపు జరుగుతుందని అణుశక్తిలో జాతీయ సామర్ధ్యాన్ని పెంపొందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం కానుంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..