నేల టిక్కెట్టు నంబర్ 420!!
- March 17, 2018క్లాసు.. మాసు...ఆడియన్స్ ఎవరైనా రవితేజ సినిమాకు రెడీనే బాసూ! నేల, కుర్చీ, బెంచ్, బాల్కనీ ఇలా వరస పెట్టి టిక్కెట్లు తెగాల్సిందే. థియేటర్స్‌లో ఎంటర్టైన్మెంట్ డబుల్.. ట్రిపుల్ అవ్వాల్సిందే. రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమాకు ‘నేల టిక్కెట్టు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో మాళవిక శర్మ కథానాయిక. తెలుగువారి తొలి పండగ ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరి సినిమాలో ఆల్ ఎమోషన్స్ గ్యారంటీ. ఏడాది పిల్లల నుంచి అందరూ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను చూసి ఫుల్‌గా ఎంటర్టైన్ అవుతారని చిత్రబృందం చెబుతోంది. కానీ ఫస్ట్ లుక్‌లో టిక్కెట్ ఖరీదు పది రూపాయాలు అని ఉంది. టిక్కెట్ నంబర్ ఏమో 420 అని ఉంది. మరి.. ఈ 420 బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాలంటే ఆడియన్స్ థియేటర్స్‌కి వెళ్లాల్సిందే. ఆల్మోస్ట్ 60 శాతం చిత్రీకరణ పూరై్తంది. ఈ చిత్రాన్ని మే 24న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?