జెడ్డా విమానాశ్రయంలో1,500 ఉద్యోగాలు త్వరలో స్థానీకులకే

- March 17, 2018 , by Maagulf
జెడ్డా విమానాశ్రయంలో1,500 ఉద్యోగాలు త్వరలో స్థానీకులకే

జెడ్డా: జెడ్డాలోని కింగ్ అబ్దుల్జిజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విమానాశ్రయం వద్ద పనిచేస్తున్న విదేశీ ఎయిర్లైన్స్, గ్రౌండ్ సర్వీస్ కంపెనీల వద్ద 1,500 కంటే ఎక్కువ ఉద్యోగాలనుస్థానికుల కోసం కేటాయించనున్నారని  మదీనా అరబిక్ వార్తాపత్రిక శనివారం ప్రకటించింది. జెడ్డా విమానాశ్రయం డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్-రైమి   విమానాశ్రయం వద్ద ఉన్న అన్ని కంపెనీలు మరియు నిర్వాహకులకు ఇటీవల ఒక నోట్  పంపిణీ చేశారు. దీని ప్రకారం  పౌరులకు పరిమితం చేయాల్సిన  ఉద్యోగాలలో విదేశీ కార్మికులతో పనిచేయించడం ఏమాత్రం తగదని ఆయన అన్నారు. విదేశీ ఉద్యోగుల స్థానంలో వెంటనే సౌదీ పౌరులకు ఆ ఉద్యోగావకాశాలను కల్పించాలని  ఆయన ఆయా కంపెనీలకు పిలుపునిచ్చారు. ఈ ప్రభావానికి అనుగుణంగా విమానాశ్రయం వద్ద సౌదీకరణ కొరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ పలు ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో తనిఖీ పర్యటనలు నిర్వహిస్తారు. కింగ్స్ అబ్దుల్ అజీజ్  విమానాశ్రయం వద్ద కంపెనీలు, ఎయిర్లైన్స్, ఎజెంట్ మరియు గ్రౌండ్ సర్వీసు ఆపరేటర్లు తదితర ఉద్యోగాలను త్వరితంగా పౌరులకు పరిమితం చేయాలనీ కోరారు. ఈ సూచనలకు వ్యతిరేకంగా సౌదీలో విదేశీ ఉద్యోగులతోనే భర్తీ చేయాలని భావిస్తే, విరుద్ధంగా వ్యవహరించిన ఆయా కంపెనీలపై కేసు నమోదు చేయడమే కాక యాజమాన్యాలపై భారీ జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు. సౌదీ పౌరులకు  పరిమితం చేయబడిన ఉద్యోగాలను స్థానీకరించడానికి సూచనలను పాటించడంలో వైఫల్యం చెందరాదని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కింగ్ అబ్దులాజిజ్ విమానాశ్రయంలో పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ టర్కి అల్-థిబ్ యొక్క అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ సౌదీ యువతని  వివిధ ఉద్యోగాల్లోకి తీసుకురావడానికి మరియు సౌదీకరణ రేటును పెంచుకోవటానికి తగిన అన్ని ప్రయత్నాలను విమానాశ్రయం పరిపాలన చేపడుతుందని ఆయన తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com