చిన్నారి కిడ్నాప్: బహ్రెయినీ వ్యక్తికి 12 1/2 ఏళ్ళ జైలు శిక్ష
- March 22, 2018మనామా: బహ్రెయిన్‌కి చెందిన ఓ వ్యక్తికి న్యాయస్థానం పన్నెండున్నరేళ్ళ జైలు శిక్ష విధించింది. 2016లో జరిగిన కిడ్నాప్ ఘటనకు సంబంధించి న్యాయస్థానం నిందితుడ్ని దోషిగా నిర్ధారించి, ఈ శిక్ష ఖరారు చేసింది. నిందితుడిపై కిడ్నాప్, సెక్సువల్ హరాష్మెంట్, పోలీసులపై దాడి, దొంగతనం, డ్రగ్స్ అబ్యూజ్ తదితర అభియోగాలు మోపబడి, నిరూపించబడ్డాయి. ఆగస్ట్ 2న హూరాలోని ఓ కమర్షియల్ రోడ్డులో ఈ దొంగతనం జరిగింది. సారా అనే చిన్నారి తల్లిదండ్రులు, కారులో తమ చిన్నారిని వదిలి, పక్కనే వున్న ఓ షాప్‌లోకి వెళ్ళగా, నిందితుడు ఆ కారుని దొంగిలించాడు. ఈ ఘటన బహ్రెయిన్ సమాజాన్ని షాక్‌కి గురిచేసింది. సోషల్ మీడియాలో సారా కోసం పెద్ద స్థాయిలో ఉద్యమమే జరిగింది. భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, బహ్రెయిన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు. కేసుని ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి సెంట్రల్ మనామాలోని ఓ ఫ్లాట్‌లో తన ప్రియురాలితో కలిసి నిందితుడు వుండగా అతన్ని అరెస్ట్ చేశారు. బాలిక సారాను రక్షించారు. బహ్రెయిన్ ప్రభుత్వం చూపిన చొరవను భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అభినందించారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..