వేసవి కాలంలో ఒంటిలోని వేడిని తగ్గించే ఒకే ఒక్క పండు..?
- April 13, 2018
కర్భూజ పండు. ఈ పండును ఇంగ్లీష్‌లో మస్క్ మిలన్ అంటారు. ఈ కాలంలో కర్భూజ పండు ఎక్కువగా లభిస్తుంది. ఈ పండులో పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, విటమిన్ - సి, విటమిన్ - ఎ, ఫ్లోరిక్ ఆమ్లాలు, ఫైబర్ వంటి పోషకాలు ఉన్న ఈ పండును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు.
ఎండాకాలంలో లభించే ఈ పండును తింటే శరీర వేడిని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒంటికి చలువ చేస్తుంది. ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువు ఉన్న వారు ఈ పండును తింటే మంచి ఫలితం ఉంటుందట.
కర్భూజ పండును తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను నివారిస్తుంది. అజీర్తి, ఎసిడిటీ, మలబద్దకం, ఆకలి అనిపించకపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ పండు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ఎముకలకు కావాల్సినన్ని పోషకాలకు అందించి ఎముకలను బలంగా మారుస్తుంది. ఇందులోని విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎండాకాలంలో త్వరగా అలసిపోవడం, నీరసంగా ఉండడం వంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఈ పండును తీసుకుంటే తొందరగా రికవరీ అవుతుంది. అలాగే కళ్ళకు కూడా బాగా సహాయపడుతుంది.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!