చికాగోలో సాయిపల్లకి సేవ కార్యక్రమం

- April 13, 2018 , by Maagulf
చికాగోలో సాయిపల్లకి సేవ కార్యక్రమం

అమెరికాలోని చికాగోలో సాయిపల్లకి సేవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతియేటా ఏప్రిల్, మే నెలల్లో సాయిపల్లకి సేవ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగా ఈ సారి దాదాపు వందమంది భక్తుల ఇళ్లలోకి సాయిపల్లికి వెళ్లినట్లు వివరించారు.  సాయిబాబా పల్లకి సేవలో భక్తులు పాల్గొని తరిస్తున్నారు. తమ ఇంటికి వచ్చిన సాయినాధున్ని భజనలు, కీర్తనలతో పూజిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో భక్తుల ఇళ్లలో పండుగవాతావరణం కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com