తన సినిమాలో శ్రీరెడ్డికి అవకాశం పై జీవిత కామెంట్స్..
- April 17, 2018 
            తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు నటి జీవిత రాజశేఖర్. కొద్ది రోజుల క్రితం హీరో రాజశేఖర్ పై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని, దీనిపై లీగల్ గా వెళతానని స్పష్టం చేశారు. నటి శ్రీరెడ్డి సినీ ఇండస్ట్రీపై చేసిన ఆరోపణల్లో కూడా వాస్తవం లేదన్నారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డికి తమ సినిమాల్లో కచ్చితంగా అవకాశం ఇస్తానన్నారు. ఆమె ఎన్నో పాత్రలకు సూట్ అవుతుందని, తనకు సరిపోయే పాత్రకు తీసుకుంటామన్నారు. కాగా నటుడు పవన్ కళ్యాణ్ పై సోమవారం శ్రీరెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వాటిపై కూడా మాట్లాడిన జీవిత రాజశేఖర్ ఆయన్ను అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది. అసలు ఆయనేమన్నారని అంత మాట అన్నారు అని శ్రీరెడ్డి ని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







