విదేశాల్లో పర్యటించేందుకు సల్మాన్‌కు కోర్టు అనుమతి
- April 17, 2018ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ విదేశాల్లో పర్యటించేందుకు జోధ్‌పూర్ జిల్లా సెషన్స్ కోర్టు అనుమతించింది. కృష్ణ జింకలను హతమార్చిన కేసులో దోషి అయిన సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు బెయిలు ఇచ్చింది. విదేశాల్లో పర్యటించాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని తీర్పులో పేర్కొంది. మే 25 నుంచి జులై 10వతేదీ వరకు సల్మాన్‌ఖాన్ సినిమా షూటింగు నిమిత్తం కెనడా, నేపాల్, అమెరికా దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. 1998వ సంవత్సరంలో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగు సందర్భంగా జోధ్ పూర్ అడవిలో సల్మాన్‌ఖాన్ కృష్ణజింకలను వేటాడిన విషయం పాఠకులకు విదితమే. ఇటీవల సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పడంతో ఆయన రెండు రోజులు జోథ్ పూర్ సెంట్రల్ జైలులో గడిపారు.
తాజా వార్తలు
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి