80 మంది ఆర్టిస్టులతో.. 'ఊపెకుహ'..
- April 24, 2018
80 మంది ఆర్టిస్టులు, 105 మంది టెక్నిషియన్స్ తో 60 రోజులు ఓ పండగ వాతావరణంలో తెరకెక్కిన నవ్వుల నజరానా మా 'ఊ. పె. కు. హ.'. ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఊ. పె. కు. హ. నవ్వుల పండగలో పని చేసినందుకు ఎంతో ఆనందంగా వుంది అంటున్నారు ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పి. ఆర్. నాగరాజు.
ఆయన మాట్లాడుతూ.. 'ఎన్నో చిత్రాలకు కో డైరెక్టర్ గా వర్క్ చేస్తూ ఊ. పె. కు. హ. చిత్రానికి ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా భాద్యతలు నిర్వహించడం ఆనందంగా వుంది. సాధారణంగా ప్రతి చిత్రంలో కామెడీ ఓ భాగంగా ఉంటుంది. కానీ నిధి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఊ. పె. కు. హ. లో సినిమా మొత్తం కామెడీయే. 80 మంది ఆర్టిస్టులు నటించిన ఈ చిత్రంలో వారందించిన సహకారం మరువలేనిది. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ గారు తన చిత్రంగా భావించి, నటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఉపేకుహ చిత్రంలో చాలా మంది ఆర్టిస్టులను చాలా చక్కగా హ్యాండిల్ చేసిన మా కెమెరామెన్ వాసు పనితనం చాలా గొప్పది. రాత్రి సందర్భాల్లో కూడా ఎవ్వరూ అలసట చెందకుండా, ముఖ్యంగా కేరళలోని కొచ్చిన్ పరిసర ప్రాంతాల్లో 45 మంది ఆర్టిస్టులతో చేసిన సీన్స్ గాని, సాంగ్స్ పరంగా గానీ వీరందరూ అందించిన సహకారం మరువలేనిది. ముఖ్యంగా అత్తాపూర్ లో 105 మంది టెక్నిషియన్స్, 80 మంది ఆర్టిస్టులు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులతో చేసిన క్లైమాక్స్ ఈ చిత్రానికి హైలైట్.
అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో హైలైట్. తాను బిజీగా ఉండి కూడా అత్యద్భుతమైన ఆర్ ఆర్ లతో పాటు ఆణిముత్యాల వంటి ఐదు పాటలను అందించారు. చాలా మంది ఆర్టిస్టులు వున్నా.. ఏ మాత్రం విసుగు చెందకుండా ఎంతో ఓర్పుతో ఎడిటింగ్ చేసిన ఎడిటర్ శంకర్ గారి కృషి మరువలేనిది. అలాగే సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సహకరించారు. ఏప్రిల్ 27 న ఊ. పె. కు. హ. సందడి మొదలవుతుంది. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది' అని అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







