అబుదాబీ:22 మంది డ్రగ్ పెడ్లర్స్ అరెస్ట్
- April 24, 2018
అబుదాబీ:అబుదాబీలో 22 మంది ఆసియా జాతీయుల్ని డ్రగ్స్ పెడ్లింగ్ కేసులో అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 20 కిలోల నార్కోటిక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్, క్రిస్టల్ డ్రగ్స్ వారి వద్ద లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ రాకెట్‌కి సంబంధించిన సూత్రధారిని కూడా గుర్తించారు. ఆసియాకి చెందినవారిగా నిందితుల్ని పేర్కొన్నారు అధికారులు. డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ కల్నల్ తాహెర్ ఘరీబ్ అల్ దహెరి మాట్లాడుతూ, సీక్రెట్ ఆపరేషన్ ద్వారా నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. గ్రూపులుగా విడిపోయి, డ్రగ్స్‌ని విక్రయిస్తున్నట్లు గుర్తించి, పక్కా ప్లాన్‌తో వారిని అరెస్ట్ చేశామన్నారు. డ్రగ్స్ పట్ల అవగాహనా కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా చేపట్టాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







