బిగ్ బ్రేకింగ్ : సినీ నటుడు బాలకృష్ణ సంచలన నిర్ణయం
- April 25, 2018సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మక 'ఎన్టీఆర్ బయోపిక్' చిత్రం నుంచి డైరెక్టర్ స్థానం నుంచి తేజ తప్పుకోవడంతో బాలకృష్ణ ఆ బాధ్యతను చేపట్టనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. తన స్వీయ దర్శకత్వంలోనే 'ఎన్టీఆర్ బయోపిక్' సినిమాను తీయాలని అనుకుంటున్నట్టు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. భారీ స్టార్ కాస్టింగ్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు. గతంలో నర్తనశాల చిత్రానికి దర్శకత్వం వహించాలనుకున్నారు బాలయ్య.. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా 'ఎన్టీఆర్ బయోపిక్' నుంచి అనూహ్యంగా తేజ తప్పుకోవడంతో ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నారు బాలకృష్ణ. కాగా గతంలో ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. అందులో ముఖ్యంగా దానవీర సూరకర్ణ , నర్తనశాల, పోతులూరి వీరబ్రహ్మగారి చరిత్ర వంటి సంచలన చిత్రాలకు దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..