తంబాకుని సీజ్ చేసిన కస్టమ్స్
- April 26, 2018దోహా: జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్స్, పెద్ద మొత్తంలో తంబాకు (నమిలే రకం పొగాకు)ని స్వాధీనం చేసుకున్నారు. ఖతార్లో ఈ తంబాకుపై నిషేధం అమల్లో వుంది. హమాద్ పోర్టులో దీన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 2.8 టన్నుల తంబాకుని వాటర్ హీటర్లలో దాచి తరలిస్తుండగా అధికారులు అత్యంత చాకచక్యంగా దీన్ని పట్టుకోవడం జరిగింది. స్కానింగ్ డివైజ్ ద్వారా చెక్ చేస్తున్న సమయంలో అనుమానాస్పద పదార్థాలు వాటర్ హీటర్లో వున్నట్లు గుర్తించి, వాటిని కస్టమ్స్ అధికారులు వెలికి తీశారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్దుల్హైది అల్ సాహిల్, తమ ఇన్స్పెక్టర్స్ పనితీరుని ఈ సందర్భంగా ప్రశంసించారు. హమాద్ పోర్టులోనే ఈ నెలలో 12 టన్నుల తంబాకుని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్