ఘోర ప్రమాదం: ఎమిరేటీ యువకుడి మృతి
- April 28, 201818 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రస్ అల్ ఖైమాలోని అల్ జజిరా అల్ హమారా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత కారు రెండు ముక్కలుగా విడిపోయింది. రస్ అల్ ఖైమా సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్, సమాచారం అందగానే సంఘటనా స్థలనాఇకి చేరుకుంది. రెస్క్యూ సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా యువకుడి ప్రాణాల్ని కాపాడలేకపోయారు. తీవ్ర గాయాలతో యువకుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలనీ, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని రస్ అల్ ఖైమా పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ సయీద్ అల్ సామ్ అల్ నక్బి వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు