కార్మికులు తమ హక్కుల కోసం పోరాడిన రోజు 'మేడే'

- April 30, 2018 , by Maagulf
కార్మికులు తమ హక్కుల కోసం పోరాడిన రోజు 'మేడే'

కార్మికులు తమ హక్కుల కోసం నినదించిన రోజు. శ్రమ విలువకు ఖరీదు కట్టమంటూ డిమాండ్ చేసిన రోజు. అలుపెరుగుని ఈ పోరాటంలో కొందరు శ్రామికులు మరణించగా వారి రక్తంతో ఎర్రజెండా పుట్టిన రోజు. అదే మేడే. కార్మికుల దినోత్సవం.  చికాగో నగరంలో 127 ఏళ్ల క్రితం కార్మికులు చేసిన పోరాట ఫలితం. 1884లో మొదలైంది ఈ ఉద్యమం. కర్మాగారాల్లో కార్మికుల చేత 14 నుంచి 16 గంటలు పని చేయించుకుంటున్నారు. నూతన యంత్రాలు ఎన్ని వచ్చినా కార్మికులకు మాత్రం పని గంటల్లో మార్పు లేదు. కనీసం సెలవులు కూడా లేవు. ఈ విషయంపై కార్మికుల్లో ఉద్యమం చేయాలన్న ఆలోచన మొదలైంది. 1886 మే1 కల్లా 8గంటల పని గంటలను సాధించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆరోజు రానే వచ్చింది. 20వేల మంది కార్మికులతో ఉద్యమం చేపట్టారు. మే2న ప్రదర్శనలు, సభలు, 3వ తేదీ కార్మికుల సమావేశం, 4వ తేదీ సభ నిర్వహించారు. 

ఈ క్రమంలో పోలీసులు కార్మికులపై దాడులకు దిగారు. సభలు, సమావేశాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో వందలాది మంది కార్మికులు మృతి చెందారు. కార్మికులు కూడా పోలీసులపై ఎదురుదాడికి దిగి బాంబుల వేశారు. బాంబు దాడిలో ఒక పోలీసు మరణించాడు. ఈ దాడికి నిరసనగా కార్మికులపై కేసు పెట్టారు పోలీసులు. 1886 ఆగస్టు 19న ఏడుగురికి మరణ శిక్ష, ఒకరికి యావజ్జీవ శిక్షవిధించారు. మరణశిక్ష అమలు సమయంలో కార్మికులు  అంతా ఏకమై ప్రత్యేక రైలులో చికాగో వెళ్లారు. నిరసన వ్యక్తం చేస్తూ 5 లక్షల మంది కార్మికులు ఊరేగింపులో పాల్గొన్నారు. చికాగోలో జరిగిన ఈ పోరాటం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. లక్షలాది మంది కార్మికుల పోరాటం, వందల మంది ప్రాణ త్యాగం.. వెరసి 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారు. 1917లో రష్యా విప్లవం తర్వాత.. ప్రపంచమంతా 8 గంటల పనిదినాన్ని ఆమోదించాల్సి వచ్చింది. మనదేశంలో మద్రాసు నగరంలో 1923లో తొలి మేడే జరుపుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com