'మయ్యమ్ విజిల్' పార్టీ యాప్‌ను ప్రారంభించిన కమల్
- April 30, 2018
చెన్నై: ప్రముఖ సినీ నటుడు, 'మక్కల్ నీది మయ్యమ్' అధినేత కమల్ హాసన్ మంగళవారం 'మయ్మమ్ విజిల్' అనే పేరుతో పార్టీకి చెందిన యాప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్ పార్టీ నేతలకు అలారమ్‌లాంటిదని, సామాన్య ప్రజల సమస్యలను తెలసుకోవడానికి మా పార్టీ నేతలు పాత్రికేయుల్లాగా పనిచేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీలో నమోదు చేసిన నేతలకు, వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ యాప్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటాము కాని, వెంటనే పరిష్కారం చూపలేమని, ఎందుకంటే ఈ యాప్ మంత్రదండం కాదని ఆయన అన్నారు. అధికారులు, నేతలపై పర్యవేక్షణకు ఈ యాప్ ఉపపయోగపడుతుందన్నారు. తమిళనాడును అవినీతి రహితంగా మార్చడమే తన రాజకీయ అజెండా అంటూ ఫిబ్రవరిలో 'మక్కల్ నీది మయ్యమ్' అనే పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్మూన్..!!
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS







