చైనా:విమానం గాల్లో ఉండగానే గాలి కోసం కిటికీ తెరిచాడు
- May 02, 2018
చైనా:విమానం గాల్లో ఉండగానే కిటికీ తెరిచాడో ఓ ప్రబుద్దుడు ! ఈ ఘటన చైనాలోని మిన్యాంగ్ నాన్‌జియావో ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. చెన్ అనే ప్రయాణికుడు విమానంలోని ఎమెర్జెన్సీ కిటికీ ప్రక్కనున్న కూర్చున్నాడు. విమానం టేకాఫ్ అవుతుండగా ఉన్నట్లుండి ఒక్కసారిగా కిటికీ తెరిచాడు. దింతో ఆ కిటికీ పూర్తిగా తెరచుకొని లోపలికి గాలి చొచ్చుకొచ్చింది. వేంటనే అప్రమత్తమైన సిబ్బంది టేకాఫ్ అర్ధాంతరంగా ఆపేవేసి ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. పోలిసులు అతన్ని ప్రశ్నించగా వింత సమాధానం ఇచ్చాడు.గాలి కోసం కిటికీ తెరచానని కానీ అది అత్యవసర ద్వారం కావడంతో పూర్తిగా ఓపెన్ అయ్యిందని వెల్లడించాడు. 15 రోజుల పాటు విమాన ప్రయాణాలు చేయకుండా ఆ యువకుడిపై నిషేధం విధించడంతోపాటు 70 వేల యెన్‌లను జరిమానా విధించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







