హైదరాబాద్ లో తనిఖీలతో నరకం చూపిస్తున్న పోలీసులు....
- May 02, 2018
హైదరాబాద్:వేళాపాలా లేని డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు హైదరాబాద్ వాసులకు నరకం చూపిస్తున్నాయి. అసలే ఇరుకు రోడ్లు.. ఆపై పీక్ ట్రాఫిక్ టైం. ఈ సమయంలో రోజూ డ్రంకెన్ డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ యూసుఫ్ గూడలో రోజూ రాత్రి 7 గంటల నుంచి 9 గంటలకు వరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం వల్లే.. నిత్యం వాహనదారులు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంటున్నారు. అంతే కాకుండా ఇక్కడే మెట్రో స్టేషన్ ను ఏర్పాటు చేయడంతో రోడ్డు మరీ చిన్నదిగా మారిపోయింది. పోలీసులు బారికేడ్లు పెట్టి.. తనిఖీలు చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆఫిస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో రోజూ ఇక్కడ ట్రాఫిక్ నిలిచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 9 గంటల తరువాత నిర్వహించాలని కోరుతున్నారు.అయితే పోలీసులు మాత్రం తమ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నామని అంటున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







