58 వ ఏట అడుగుపెట్టిన మోహన్ లాల్
- May 23, 2018మలయాళం సూపర్‌స్టార్, 'జనతా గ్యారేజ్' నటుడు మోహన్‌లాల్ ఇటీవలే 58 వ ఏట అడుగుపెట్టారు. 1960 మే 21న కేరళలోని ఎల్నాథూర్లో జన్మించిన మోహన్‌లాల్ పూర్తిపేరు మోహన్‌లాల్ విశ్వనాథ్ నాయర్. 1960లో 'మంజిల్ విరింజా పూక్కల్' అనే మలయాళ చిత్రంతో సినీరంగంలో కాలుమోపారు. మోహన్‌లాల్ నటునిగానే కాకుండా ప్రొడ్యూసర్, సింగర్, థియేటర్ ఆర్టిస్టుగానూ పేరొందారు. మోహన్‌లాల్‌కు ఊటీతోపాటు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్నాయి. బుర్జ్ ఖలీఫాలోని ఫ్లాట్‌ను రూ. 212 కోట్లు వెచ్చించి మోహన్‌లాల్ కొనుగోలు చేశారు. మోహన్‌లాల్ దగ్గర రూ. 7.5 కోట్ల విలువైన లగ్జరీ కార్లున్నాయి. అలాగే ఫిలిం ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలతో పాటు రెస్టారెంట్, మసాలా ప్యాకేజింగ్ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. మోహన్‌లాల్ కు ఒక కుమారుడు. ఒక కుమార్తె ఉన్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు