అజ్మన్:బాల్కనీ నుంచి పడి చిన్నారి మృతి
- May 22, 2018
అజ్మన్:13 ఏళ్ళ అరబ్ బాలిక అల్ జుర్ఫ్ ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్ ఐదో ఫ్లోర్ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బాలిక మాత్రమే ఇంట్లో వుందనీ, ఆమె కుటుంబ సభ్యులు షాపింగ్ కోసం బయటకు వెళ్ళారని పోలీసులు వెల్లడించారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు వెళ&ఇళనట్లు అల్ హమదియా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ యాహ్యా అల్ మత్రౌషి చెప్పారు. పోలీస్ పెట్రోల్, సిఐడి ఆఫీసర్స్, ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్స్, అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకున్నా, బాలికను రక్షించలేకపోయారు. తీవ్రమైన గాయాలతో ఆమె ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది. బాలికను గ్రేడ్ ఫైవ్ స్టూడెంట్ అల్ అనూద్‌గా గుర్తించారు. షేకా బింట్ సయీద్ ఎలిమెంటరీ స్కూనలో ఆమె విద్యనభ్యసిస్తోంది. ఈ ఘటన వెనుక ఎలాంటి నేర కోణం వున్నట్లు కన్పించలేదని అధికారులు పేర్కొన్నారు. స్కూల్ నుంచి వచ్చాక తమ కుమార్తె నిద్రపోయిందనీ, షాపింగ్‌కి రమ్మని పిలిచినా, నిరాకరించిందని మృతురాలి తల్లి పోలీసులకు వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..