ఎంత నేర్పుగా సమాధానం ఇచ్చిందో చూడండి అమ్మాడీ!
- May 23, 2018వాహ్ ..మహానటిలో కీర్తి అదరగొట్టింది..సావిత్రి పూనిందా అన్నట్టుగా నటించింది..ఏం అభినయం ఏం అభినయమే మహానటి సావిత్రినే మరిపించి ఈ తరం మహానటి అనిపించుకుంది..ఈ పరభాష పిల్ల మన సావిత్రి పాత్ర పోషించడమా అంటూ పెదవి విరిచిన అందరిని తన నటనతో ముక్కున వేలేసుకునేలా చేసింది..మహానటిలో కీర్తి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది..కానీ కీర్తి..నెక్స్ట్ ఏంటీ.అవును నెక్స్ట్ ఏంటీ..
సాధారణంగా హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ పాత్రలు పోషించడం కంటే గ్లామర్ డాల్స్ గా కమర్షియల్ సినిమాల్లో నటించడానికే ఆసక్తి చూపుతారు..ఎందుకంటే ఒకసారి లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో మునిగిపోతే ఆ సినిమాలు ఎక్కువగా వస్తాయో లేవో తెలీదు..అవి హిట్ అవుతాయో లేదో అస్సలు తెలీదు.ఈ విషయంలో క్లిక్ అయిన ఈ కాలం హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది అనుష్క మాత్రమే..మొదట్లో గ్లామర్ పాత్రలు మాత్రమే పోషిస్తూ వచ్చింది.తర్వాత అరుంధతి నుండి భాగమతి వరకూ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసింది.మరోవైపు తన పాత్రకు ప్రాధాన్యం ఉండేలా పెద్ద హీరోల పక్కన నటిస్తూ గత పదేళ్లుగా ఇండస్ట్రీలో తనస్థానాన్ని పదిలంగా కాపాడుకుంటుంది..మరిప్పుడు కీర్తి..
అందరి దృష్టి కీర్తి గురించి కీర్తి నెక్స్ట్ ఒప్పుకోబోయే పాత్రల గురించే..అదే ప్రస్తావన కీర్తి దగ్గర తెస్తే ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసా..ఇంత చిన్న వయసులో అంత పెద్ద పాత్రా. ఇక పెద్ద సినిమాల్లో చిలిపి పాత్రలు రావా. ఓ లవ్వు.. ఓ కెవ్వు.. ఓ స్టెప్పు లాంటి కమర్షియల్ క్యారెక్టర్లు దొరక్కపోతే లైఫ్ వెలవెలలాడిపోదూ? బ్రాండ్ దశ దిశలా రీ-సౌండ్ కొట్టినా క్రేజ్ కిల్ అయిపోతే కెరియర్ డల్ అయిపోదూ? అని అడిగితే. "నన్ను మరపించే పాత్రలు రావాలి. మిమ్మల్ని మురిపించే నటన నాది కావాలి" అంటున్నారు కీర్తీ సురేష్.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..