ఎక్స్‌పోజింగ్ దుస్తులతో ఎక్స్‌ట్రాలు..

- June 12, 2018 , by Maagulf
ఎక్స్‌పోజింగ్ దుస్తులతో ఎక్స్‌ట్రాలు..

సమయం, సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, పవిత్రమైన దేవాలయాలకు వెళ్లేటప్పుడు నిండైన బట్టలతో భగవంతుడిని దర్శించాలి. చూపరులకు ఎబ్బెట్టు కలిగించే రీతిలో వస్త్రధారణ లేకుండా చూసుకోవలసిన బాధ్యత ఎవరికి వారికే ఉండాలి. అయినా ఆలయ పూజారులు కూడా దేవాలయాలకు వచ్చేటప్పుడు పద్దతైన బట్టలు వేసుకొని రావాలంటూ రూల్సు కూడా పెట్టారు. అసలే రంజాన్ మాసం. ముస్లిం సోదర సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో అల్లాని ఆరాధించే పవిత్ర మాసం. ఈ మాసంలో స్నేహితులకు బంధువులకు ఇప్తార్ పేరుతో విందు ఏర్పాటు చేస్తుంటారు. కులమతాలకతీతంగా హాజరై ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు అందజేస్తారు. ఈ వేడుకకు హాజరైన బాలీవుడ్ నటి సోనాలీ రౌత్ ముస్లిం సాంప్రదాయానికి అతీతంగా డ్రెస్ చేసుకుని విందుకు హాజరైంది. కాంగ్రెస్ నేత బాబా సిద్ధికీ ఇచ్చే విందుకు హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఆమె కూడా ఒకరు. ర్యాంప్ వాక్‌కు వెళుతున్నట్లుగా హాజరైన ఆమెను చూసి అతిధులు అవాక్కయ్యారు. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను చూసిన నెటిజన్స్ మతానికి గౌరవం ఇవ్వకపోయినా, కనీసం పండుగకైనా ప్రాధాన్యత ఇవ్వాల్సింది అని సోనాలీని విమర్శిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com