పచ్చిమామిడి కాయను తరచుగా తీసుకుంటే?
- July 28, 2018పచ్చిమామిడికాయలు విరివిగా దొరికే కాలమిది. ఇందులో ఎన్నో పోషకాలున్నాయి. ఆరోగ్యానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పచ్చిమామిడిని పచ్చడి గాను, కూరల్లో గాను చేర్చి తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.
ఎసిడిటీ వలన ఛాతీలో మంటతో కూడిన నొప్పి వస్తుంది. అలాంటప్పుడు పచ్చిమామిడికాయ ముక్కని సన్నగా తరిగి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును.గర్భిణులకు వాంతులు, వికారం వలన అసౌకర్యంగా ఉంటుంది. వారు పచ్చిమామిడి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
చాలామందికి మధ్యాహ్నం వేళ భోజనం చేసిన తరువాత బద్దకంగా అనిపిస్తుంది. అలాంటి వారు పచ్చిమామిడిని తీసుకుంటే చురుగ్గా ఉంటారు. పచ్చిమామిడి తినడం వలన ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి. పుల్లటి మామిడి ముక్కల్లో ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాలను దూరం చేసే గుణం ఉంటుంది.
శరీరంలో వేడి తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచడంతో పాటు కొత్త రక్తకణాల నిర్మాణానికి దోహదపడుతుంది. చిగుళ్ల ఇన్ఫెక్షన్స్, రక్తం కారడం, పన్ను నొప్పి వంటివి దూరం కావాలంటే మామిడి ముక్కను నమలాలి. దాంతో బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి. దంతాలు శుభ్రపడుతాయి. పళ్ల మీద ఎనామిల్ కూడా దృఢంగా ఉంటుంది. నోటి దుర్వాసనలు దూరమవుతాయి.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్