'హలో గురు ప్రేమకోసమే' టీసర్ విడుదల
- September 17, 2018రామ్ , అనుపమ జంటగా నేను లోకల్ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హలో గురు ప్రేమకోసమే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు.
టీజర్ చూస్తే. అనుపమ బయట కూర్చుని జుట్టు సరిచేసుకుంటుంటే..లోపలి నుండి బయటకొచ్చిన రామ్ అనుపమ నడుము అందాలు చూస్తూ ఉండిపోయాడు..అప్పుడు పసిగట్టి చూసావా నీకోసమే కాఫీ ఎలాగుంది అని అనుపమ అంటే హాట్ ఉంది కాఫీ అని రామ్ చెప్పే ఈ రొమాంటిక్ సీన్ సినిమా ఫై అంచనాలు పెంచేలా ఉన్నాయ్.
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు తనదైన సంగీతాన్ని అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తున్నారు. విజయ్ కె.చక్రవర్తి సినిమాటోగ్రఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వర్క్, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ అందిస్తున్నారు.బెజవాడ ప్రసన్నకుమార్ మాటలు.. రచన సహకారం సాయికృష్ణ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?