లాంగ్ టెర్మ్ రెసిడెన్స్ వీసాపై హర్షం
- September 17, 2018
యూఏఈలోని వలసదారులు, రిటైర్‌మెంట్ తర్వాత ఎక్కువ కాలం యూఏఈలో వుండేందుకు వీలుగా యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ చేసిన ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఐదేళ్ళ రెసిడెన్స్ వీసాకి సంబంధించి నిబంధనలు ఇలా వున్నాయి. 55 ఏళ్ళకు పైబడ్డవారికి ఐదేళ్ళకుగాను ప్రత్యేక పరిస్థితుల్లో వీసాని మంజూరు చేస్తారు. వలసదారుడు ఖచ్చితంగా 2 మిలియన్ దిర్హామ్‌ల విలువైన ప్రాపర్టీలో ఇన్వెస్ట్‌మెంట్ కలిగి వుండాలి. 1 మిలియన్ లేదా అంతకు మించి సేవింగ్స్ వుండాలి. 20,000 దిర్హామ్‌ల కంటే ఎక్కువగా యాక్టివ్ ఆదాయం కలిగి వుండాలి. ఈ మూడింటిలో ఏది కలిగి వున్నా, వారికి ఐదేళ్ళ కాలానికి రెసిడెన్సీ వీసా దక్కుతుంది. దశాబ్దాలుగా యూఏఈలో నివసిస్తున్నవారికి ఇది ఎంతో ఉపకరిస్తుందని రాయల్ ఆర్కిడ్ గ్రూప్ ఓనర్ వినయ్ వర్మ చెప్పారు. 17 ఏళ్ళుగా తాను యూఏఈలో నివసిస్తున్నాననీ, తమకు ఈ నిర్ణయం ఎంతో ఆనందాన్నిచ్చిందని లైన్ ఇన్వెస్టిమెంట్ డైరెక్టర్, లులు గ్రూప్ ఎక్స్‌ప్రెసెస్ వజీబ్ అల్ ఖౌరి చెప్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







