వాషింగ్ మెషీన్ పేలి 9 మందికి గాయాలు
- September 17, 2018అజ్మన్‌లోని ఓ ఫ్లాట్‌లో జరిగిన ప్రమాదం కారణంగా ఆ ఫ్లాట్‌లోని సామాగ్రి ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారంతా అరబ్ జాతీయులే. పొగ పీల్చడంతో వీరికి అస్వస్థత కలిగింది. వారికి ప్రాథమిక చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు సివిల్ డిఫెన్స్ సిబ్బంది. అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆపరేషన్ రూమ్‌కి సమాచారం అందడంతో, వెంటనే సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్స్ మరియు సివిల్ డిఫెన్స్ చేరుకున్నాయి. రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరగ్గా, వెంటనే స్పందించిన సివిల్ డిఫెన్స్, చాకచక్యంగా మంటల్ని అదుపు చేశాయి. ఈ అగ్ని ప్రమాదానికి వాషింగ్ మెషీన్ కారణంగా గుర్తించారు. సెంట్రల్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ రయీద్ ఒబైద్ అల్ జాబి మాట్లాడుతూ, హౌస్ హోల్డ్స్ మరియు రెసిడెన్షియల్ యూనిట్స్‌లో భద్రత పరంగా నిర్లక్ష్యం తగదని చెప్పారు. గృహోపకరణాల వాడకంలో అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..