అమెరికాలో ఆ విషయంలో మనమే టాప్
- September 19, 2018అమెరికా పౌరసత్వం.. చాలామందికి అదోక కల. అందుకు తగ్గట్టుగానే.. ఆ దేశ పౌరసత్వం పొందడం కూడా చాలా కష్టం. ఎన్నో దేశాలకు చెందిన వ్యక్తులు యూఎస్ పౌరసత్వం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. కానీ.. అమెరికాలో భారతీయుల పరిస్థితి మరోలా ఉంది. గతేడాది అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య పెరిగింది. 2016తో పోల్చితే 2017లో 10 శాతం మేర వృద్ధి కినిపించింది. ఏకంగా 50 వేల మంది ఆ దేశ పౌరసత్వం పొందారు. ఇదే సమయంలో అమెరికా పౌరసత్వం పొందిన మిగతా దేశస్థుల సంఖ్య తగ్గింది. 2016తో పోల్చితే 2017లో 6 శాతం పడిపోయింది. 2016-17 మధ్య అమెరికా పౌరసత్వం పొందినవారిలో మెక్సికన్లు మొదటి స్థానంలో ఉండగా.. మనోళ్లు రెండో స్థానంలో నిలిచారు. మొత్తం 7 లక్షల మందికి అమెరికా పౌరసత్వం లభించగా.. అందులో భారతీయులు 7 శాతం మంది ఉన్నారు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్‌లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!