భేటీ అవ్వనున్న భారత్, పాక్
- September 19, 2018
పాకిస్తాన్ తో చర్చలకు భారత ప్రభుత్వం రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంతో పొరుగుదేశాలతో స్నేహం సాధారణ స్థాయిలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశాల నేపథ్యంలో న్యూయార్క్‌లో ఈనెల 26వ తేదీన భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలుపుతూ పాకిస్తాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య మళ్ళీ సంప్రదింపుల ప్రక్రియ మొదలయ్యేందుకు ఈ లేఖతో శ్రీకారం చుట్టారు. ఈనెల 27వ తేదీన సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగనుంది. ఆ భేటీకి ఒక రోజు ముందు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషి భేటీ అవుతారు. మరోవైపు వివిధ రకాల వస్తువులతో భారత ట్రక్కులు తమ దేశం గుండా ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్ళేందుకు పాకిస్తాన్ అంగీకరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







