బాలయ్య తో నటించనున్న కళ్యాణ్ రామ్
- October 12, 2018క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురానున్నారు. తొలి భాగాన్ని ఎన్టీఆర్ కథానాయకుడు, రెండో భాగాన్ని ఎన్టీఆర్ మహానాయకుడు గా తీసుకురానున్నారు. ఈ రెండు కూడా వచ్చే యేడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. ఇక, హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడు కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. తాజాగా, దీనిపై కళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. '30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో 'బాలగోపాలుడు' సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు .. బాబాయ్, వాళ్ల నాన్న గారిలా.. నేను, మా నాన్నగారిలా' అని పోస్ట్ చేశారు.
ఈ చిత్రం కోసం కళ్యాణ్ రామ్ 20రోజుల పాటు డేట్స్ కేటాయించినట్టు సమాచారమ్. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం. సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు