నటి రేవతిపై కేసు..
- October 15, 2018నటి రేవతిపై కొచ్చికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్నేళ్ల క్రితం షూటింగ్ సమయంలో 17 ఏళ్ల బాలికపై ఎవరో అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె చెప్పారన్నారు. అయితే ఆ బాధితురాలు పేరు చెప్పకుండా ఆమె దాచారని ఆరోపించాడు కేరళలోని ఎర్నాకులంకు చెందిన సియాజ్ జమాస్ అనే వ్యక్తి. ఈ వ్యవహారంపై నటి రేవతిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదుపై రేవతి స్పందించారు. 17 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగిందని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఆ రోజు అర్ధరాత్రి తాను బస చేసిన హోటల్ గదికి కాపాడండి అంటూ ఓ బాలిక, బామ్మ భయంతో తన దగ్గరికి వచ్చారని తెలిపారు. ఆ నైట్ అంతా వారితో నిద్రలేకుండా గడిపినట్లు తెలిపారు. అయితే మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఆ సంఘటన గురించి ప్రస్థావించానని రేవతి వివరించారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..