యాప్ ద్వారా దుబాయ్‌లో పార్కింగ్ రిజర్వేషన్
- October 15, 2018
దుబాయ్:పార్కింగ్ స్పేస్ కోసం వృధాగా సమయాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆర్‌టిఎ (దుబాయ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ) ఈ మేరకు పార్కింగ్ రిజర్వేషన్ యాప్‌ని 38వ జిటెక్స్ వీక్ సందర్భంగా ప్రారంభించింది. పార్కింగ్ రిజర్వేషన్‌ని 10 దిర్హామ్‌ల అడ్వాన్స్ ప్రీమియమ్‌తో పొందేందుకు ఈ యాప్ అవకాశం కల్పిస్తుంది. గంటకు 10 దిర్హామ్‌లు చెల్లించి, పార్కింగ్ పొందవచ్చు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో చెల్లింపులు చేయడానికి వీలుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. త్వరలో ఐవోఎస్ పవర్డ్ గ్యాడ్జెట్స్, ఐఫోన్లలోనూ పనిచేసేలా యాప్‌ని తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పార్కింగ్ రిజర్వేషన్స్ దుబాయ్ మెరినా, దుబాయ్ మీడియా సిటీలలోనే అందుబాటులో వుండగా, ముందు ముందు మరిన్ని ప్రాంతాల్లో ఈ అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







