వాట్సాప్ లో కొత్త ఫీచర్
- October 15, 2018
ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ వాట్సాప్ యూజర్లకు మరో వెసులుబాటును కల్పించింది. మెసేజ్‌లను డిలీట్ చేసే గడువును భారీగా పొడిగించింది. పొరపాటున సెండ్ చేసిన మెసేజ్‌ను కొంత సమయంలోపే డిలీట్ చేయాల్సి ఉంటుంది కదా.. ఈ అంశంలోనే వినియోగదారులకు భారీ ఊరట కల్పించనుంది. ఈ మేరకు తాజాగా ఈ ఫీచర్‌లో మరో మార్పు తీసుకురానుంది.
గతేడాది కొత్త ఫీచర్ "డిలీట్ ఫర్ ఎవ్రీవన్"ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా ఒక వేళ ఏదైనా మెసేజ్ పంపించాల్సిన గ్రూప్ లేదా కాంటాక్ట్‌కు కాకుండా మరో గ్రూపు లేదా కాంటాక్ట్‌కు పంపించినట్లయితే ఆ మెసేజ్‌ను అవతల వ్యక్తి చూసుకోనంత వరకు అంటే 13 గంటల 8 నిమిషాల 16 సెకన్ల వరకు ఎప్పుడైనా డిలీట్ చేయవచ్చు. ఇప్పటివరకు ఇలా సెండ్ చేసిన సందేశాలను 68నిమిషాల లోపు మాత్రమే తొలగించే అవకాశం ఉంది. తాజా అప్‌డేట్ ప్రకారం డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ వినియోగించి మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చని వాట్సాప్‌ను మానిటర్ చేస్తున్న వాబిటెయిన్ ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది. అయితే సాధారణంగా ఇది అవతల వ్యక్తి ఫోన్ స్విఛ్చాఫ్ చేసి పెట్టుకున్న సందర్భాల్లో జరుగుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







