నవంబర్ 5న విడుదల కానున్న మల్టీస్టారర్ మూవీ ఫస్ట్ లుక్
- November 04, 2018టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్2 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్). వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో హ్యట్రిక్ విజయాల దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంకి సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకులలో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. రీసెంట్గా కూలీ బ్యాడ్జీలతో ఇద్దరు హీరోల ఫోటోని అనీల్ రావిపూడి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది వైరల్ అయింది . తాజాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను దీపావళి కానుకగా నవంబర్ 5న సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నారని చిత్ర యూనిట్ కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌తో మెహరీన్ జతకట్టారు. ముంబై ప్రాంతానికి సంబంధించిన కథ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదల కానుంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..