వెలుగుల దీపావళి: దుబాయ్‌లో ఈవెంట్స్ సందడి
- November 05, 2018దుబాయ్:దుబాయ్‌లో వెలుగుల దీపావళి కోసం ఏర్పాట్లు జోరందుకున్నాయి. దుబాయ్ క్రీక్ తొలిసారిగా ఎమిరేట్స్ అఫీషియల్ దివాలీ దియా లైటింగ్ సెర్మానీ జరగబోతోంది. నవంబర్ 7 రాత్రి 8.30 నిమిషాలకు ఈ ఈవెంట్ జరుగుతుంది. పెద్దయెత్తున ఆకాశంలో ఫైర్ వర్క్స్ జరగనున్నాయి. పది రోజులపాటు సాగే దీపావళి సెలబ్రేషన్స్‌ని దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటెయిల్ ఎస్టాబ్లిష్మెంట్, దుబాయ్ పోలీస్, ఇండియా కాన్సులేట్ జనరల్, మీరాస్ అల్ సీఫ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. బాలీవుడ్ భాంగ్రా పెర్ఫామెన్స్లు, ఎల్ఇడి లైట్లకు సంబంధించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్, సూపర్ కార్స్ డిస్ప్లే, మార్చింగ్ బ్యాండ్స్ పెర్ఫామెన్స్ - దుబాయ్ పోలీస్ ఇతర ప్రధాన ఆకర్షణలు. నవంబర్ 10న రికార్డ్ అటెంప్ట్‌ని అల్ సీఫ్ ధో డెక్‌లో చేస్తారు. నవంబర్ 1 నుంచి 10 వరకు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లైట్ అప్ దుబాయ్ కార్యక్రమం జరుగుతుంది. దుబాయ్ క్రీక్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దివాళీ మార్కెట్, అల్ సీఫ్.. ఇలా పలు ప్రాంతాల్లో ఈవెంట్స్ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు