దీపావళి కానుగా 'అంతరిక్షం' పోస్టర్ రిలీజ్!
- November 07, 2018మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా అంతరిక్షం. డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అంతరిక్ష నేపధ్యంలో సాగే ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. లావణ్య త్రిపాఠి, అదితిరావు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు.
హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్, అదితిరావు వ్యోమగాములుగా కనిపించనున్నారు. దసరా కానుకగా చిత్ర టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. దీపావళి సందర్భంగా సినిమా నుండి పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సంప్రదాయ గెటప్ లో దర్శనమిచ్చారు.వరుణ్ తేజ్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామాలో హుందాగా కనిపిస్తే.. లావణ్య లంగావోణీలో అందంగా కనిపిస్తోంది.
ఈ సినిమాను డిసంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఘాజీ చిత్రంలానే ఈ సినిమా భారీ హిట్ అవుతుందని టీం భావిస్తుంది. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. వి.ఎస్. జ్ఞానశేఖర్ ఛాయా గ్రాహకుడు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?