యూఏఈ నేషనల్ డే: ఎమిరేట్స్ స్పెషల్ ఫేర్స్
- November 12, 2018దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ క్యారియర్ 20 గ్లోబల్ డెస్టినేషన్స్కిగాను స్పెషల్ ఫేర్స్‌ని ప్రకటించింది. యూఏఈ నేషనల్ డే లాంగ్ వీకెండ్ నేపథ్యంలో ఈ ఆఫర్‌ని ప్రకటించడం జరిగింది. నవంబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు బుక్ చేసుకున్న ప్రయాణీకులు, జులై 31 వరకు ప్రయాణించేందుకు ఈ స్పెషల్ ఫేర్స్ వర్తిస్తాయి. కొలంబోకి ఎకానమీ క్లాప్ ప్రయాణం కేవలం 1,495 నుంచే ప్రారంభమవుతాయి. లండన్‌కి 2,655 దిర్హామ్‌లకు, కేప్ టౌన్‌కి 3,635 దిర్హామ్‌లకు వెళ్ళేందుకు వీలుంది. బీరట్, మిలాన్ తదితర ప్రాంతాలకూ స్పెషల్ ఫేర్స్ వర్తిస్తాయి. బిజినెస్ క్లాస్ ఫేర్స్ విషయానికొస్తే, కొలంబస్ 3,775 దిర్హామ్‌లకు, కేప్‌టౌన్ 5,835 దిర్హామ్‌లకు, బ్యాంకాక్ 11,205 దిర్హామ్‌లకు టిక్కెట్లు అందుబాటులో వుంటాయి. అదనంగా 725 దిర్హామ్‌లు చెల్లించి ఫైవ్‌స్టార్ హాలిడే ఎక్స్పీరియర్స్ని పొందే వీలు కూడా కల్పిస్తోంది ఎమిరేట్స్. మరిన్ని వివరాలు ఎమిరేట్స్ వెబ్సైట్లో కనుగొనవచ్చు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..