స్మోక్ డిటెక్టర్స్, ఫైరల్ అలార్మ్స్ ఇకపై తప్పనిసరి
- November 14, 2018వచ్చే ఏడాది నుంచి ఇండస్ట్రియల్, కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌కి షార్జాలో స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ అలార్మ్ సిస్టమ్స్ తప్పనిసరి. విల్లాస్ మరియు ప్రైవేట్ హౌస్‌లకు మాత్రం, ఇది ఆప్షనల్. కాగా, భవనాల ఓనర్లకు ఇప్పటికే స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ అలార్మ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నోటీసులు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. షార్జా ప్రివెన్షన్ అండ్ సేఫ్టీ అథారిటీ అలాగే సానిద్, ఎప్పటికప్పుడు ఈ స్మోక్ డిటెక్టర్స్, ఫైర్ అలార్మ్ సిస్టమ్స్‌కి సంబంధించి భవనాల యజమానుల్ని అప్రమత్తం చేయనున్నాయి. ఎస్పిఎస్ఎ డైరెక్టర్ షేక్ సైఫ్ మొహమ్మద్ అల్ కాసిమి మాట్లాడుతూ, తనిఖీలు అన్ని భవనాల్లోనూ జరుగుతాయని చెప్పారు. ఎస్పిఎస్ఎ, కంపెనీ స్టాఫ్ అలాగే స్టేక్ హోల్డర్స్‌కి ఫైర్ ప్రివెన్షన్పై శిక్షణ ఇప్పించేందుకు ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించడం జరిగింది. ఈ తరహా ట్రెయినింగ్ కోసం కంపెనీలకు ఒక్కో ఉద్యోగికి శిక్షణ ఇప్పించేందుకు 250 దిర్హామ్‌లు వసూలు చేస్తోంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..