నయన్ బర్త్ డే స్పెషల్: 'సైరా' మోషన్ టీజర్ రిలీజ్
- November 18, 2018మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న సినిమా 'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నేడు నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం విషెస్ చెబుతూ.. నయన్ ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన మోషన్ టీజర్‌ను విడుదల చేసింది.
'వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే నయనతార. ఈ సందర్భంగా 'సైరా నరసింహారెడ్డి' నుంచి సిద్ధమ్మ అద్భుతమైన లుక్' అని ట్వీట్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో నయన్ పాత్ర పేరు సిద్ధమ్మ. ఈ సినిమాలో చిరు డ్యుయెల్ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణానంతరం ఆయన స్ఫూర్తితో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని కొనసాగిస్తాడు. ఈ పాత్రను కూడా చిరంజీవితోనే చేయించనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..