విడుదల అయిన 'తెలంగాణ దేవుడు' ట్రైలర్
- November 18, 2018తెలంగాణాలో ఎన్నికల నగారా మోగింది. ప్రచారాలు ఊపందుకున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో చడీచప్పుడు లేకుండా 'తెలంగాణ దేవుడు' ట్రైలర్ రిలీజ్ కావటంతో అంతా అవాక్కయ్యారు. అంతేకాండోయ్.. ఇదివరకు వచ్చిన అన్ని ట్రైలర్స్‌కి భిన్నంగా 6 నిమిషాల 3 సెకనుల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్లో పలు ఆసక్తికర, ఆలోచింపజేసే సన్నివేశాలు చూపించారు. హరీష్ దర్శకత్వంలో మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన 'తెలంగాణ దేవుడు' మూవీ.. కేసీఆర్ బయోపిక్ అని తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా వదిలిన ఈ ట్రైలర్లో శ్రీకాంత్, సుమన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, అజయ్, ప్రభాకర్, షియాజీ షిండే, సంగీత తదితర భారీ తారాగణం కనిపించటంతో ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. చిత్రంలో విజయ్ దేవ్ అనే పేరుతో లీడ్ రోల్ పోషిస్తున్నాడు శ్రీకాంత్. ట్రైలర్ ప్రకారం చూస్తే.. కేసీఆర్ బాల్యం నుంచి మొదలు యవ్వనం, రాజకీయ ప్రవేశం, ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం కవర్ చేశారని అనిపిస్తోంది. మొత్తానికైతే ఈ ట్రైలర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కావటం విశేషం.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు