అమెరికాలో కాల్పులు, తెలంగాణ వ్యక్తి మృతి
- November 18, 2018
అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణకు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. వెంట్నార్ సిటీలో నివసిస్తున్న మెదక్‌కు చెందిన సునీల్ ఎడ్లాను అతని ఇంటి ముందు గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి చంపేశాడు.
ఆఫీసు అయ్యాక సునీల్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో బాలుడు అతనిపై కాల్పులు జరిపాడు. ఆ బాలుడు సునీల్ వచ్చే వరకు వేచి చూసి, రాగానే కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సునీల్ వయస్సు 61. కాల్పుల అనంతరం సునీల్ కారును తీసుకొని అతను పారిపోయాడు. సునీల్ తన తల్లి 95వ పుట్టిన రోజు వేడుకల కోసం మెదక్‌లోని సొంత ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. సునీల్ తలపై కాల్చడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సునీల్ కారులో ఉన్న ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా జాడ తెలుసుకుని బాలుడిని అరెస్ట్ చేశారు. సునీల్‌ను ఎందుకు హత్య చేశారనే విషయం తెలియరాలేదు. పోలీసులు కాల్పులు జరిపిన బాలుడిని విచారిస్తున్నారు. మైనర్ కావడంతో అతడి పేరును బయటకు రానీయడం లేదు. సునీల్ 25 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. సునీల్‌కు మెదక్, పశ్చిమ గోదావరి జిల్లాలలో బంధువులు ఉన్నారు
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







